మడకశిర పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షడు మంజునాథ్ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిప్పేస్వామి మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రజాస్వామిహక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడే అంబేద్కర్ ఆనితెలిపారు.