మిచాంగ్ తుపాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది.
ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగుల గరిష్ఠానికి చేరింది. దీంతో 10 గేట్లు ఎత్తి 6000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకు సైతం నీటి విడుదలను నిలిపేశారు.