ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో నలుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. వీరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో ఉన్నారు.
హెచ్సిఎల్ చైర్పర్సన్ రోష్ణి నాదర్ మల్హోత్రా 60వ స్థానంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమ మండల్ 70వ స్థానంలో, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా 76వ స్థానంలో ఉన్నారు.