సైబర్ క్రైం నేరాల్లో బెంగళూరు అగ్రభాగాన నిలిచింది. సైబర్ నేరాలకు సంబంధించి దేశంలోని 19 మహానగరాల జాబితాలో బెంగళూరు అగ్రభాగాన ఉండగా లఖ్‌నవ్ రెండోస్థానంలోనూ, ఘజియాబాద్ మూడోస్థానంలో ఉన్నాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక పేర్కొంది.
ఈ నివేదిక హోంశాఖ వర్గాలను కలవరపరుస్తోంది. 2021లో బెంగళూరులో 6,423 సైబర్ నేరాలు నమోదు కాగా, 2022 నాటికి ఇది ఏకంగా 9,940కు పెరిగింది.