తుపానుపై ముందస్తు చర్యలు చేపట్టడంలో జగన్ విఫలమయ్యాడని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. 'రైతులు ఇబ్బందుల్లో ఉన్నా జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదలట్లేదు.
బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో నిర్లక్ష్యం వహించాడు. రైతులకు టార్పాలిన్లు, గోనె సంచులు పంపిణీ చేయలేదు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి' అని ఆయన డిమాండ్ చేశారు.