ముఖ్యమంత్రి కమ్యూనిటీ వెడ్డింగ్ ప్రోగ్రామ్ కింద యూపీలో దాదాపు 50,000 వివాహాలు జరగనున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ వివాహాలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
2023-24లో 1,09,883 వివాహాలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 11,489 వివాహాలు జరిగాయన్నారు. ఇప్పటివరకు 68,825 దరఖాస్తులను స్వీకరించామని చెప్పారు. వితంతువులు, విడాకులు తీసుకున్న, ఒంటరి మహిళలు, ఎస్సీ, బీసీల ప్రజలు ఈ పథకానికి అర్హులు.