ఉత్తర కొరియా అధినేత, నియంత కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు పెట్టుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రసంగిస్తూనే దేశ ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏడ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రసంగిస్తూనే దేశ ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెబుతూ విలపించారు. ఉత్తరకొరియాలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇటీవల దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న అధ్యక్షుడు కిమ్, ఆ తల్లులను ఉద్దేశించి మాట్లాడారు.
"జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన కర్తవ్యం. ఇందుకోసం మా ప్రభుత్వం తల్లులతో కలిసి పనిచేయాలని అనుకుంటోంది" అని చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలోని తల్లులంతా మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతూ కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగం వినగానే కార్యక్రమానికి హాజరైన మహిళలు కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రసంగం మధ్యలో కిమ్ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి.