లాస్ వేగస్ క్యాంపస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో ఓ ప్రొఫెసర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాల్పులు జరిపిన వ్యక్తి కూడా అక్కడే శవమై కనిపించాడు. 67 ఏళ్ల దుండగుడు యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటన అనంతరం పోలీసులు యూనివర్సిటీని ఖాళీ చేయించారు.