కేరళ తిరువనంతపురానికి చెందిన డాక్టర్ షహానా ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్జరీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుకేషన్ కోర్సు చదువుకుంటోంది. తల్లి షహానా, ఇద్దరు తోబుట్టువులతో ఉంటోంది. డాక్టర్ ఈఏ రువైస్ అనే వ్యక్తితో షహానా కొంతకాలంగా సహజీవనంలో ఉండి, పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
వరకట్నంగా 150 గ్రాముల బంగారం, 15 ఎకరాల భూమి, BMW కారు డిమాండ్ చేశారు. షహానా కుటుంబం తీర్చలేమని చెప్పడంతో పెళ్లి రద్దయింది. దీంతో షహానా తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని స్ధానికులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేశారు.