ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాన్ భాదిత ప్రాంతాలకి ప్రభుత్వం చేయూత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 03:27 PM

తుపాను ప్రభావానికి గురైన జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం వేగంగా సహాయక చర్యలు చేపట్టింది. తుపాను ప్రారంభం కాక ముందు నుంచే కట్టుదిట్టంగా ముందస్తు ఏర్పాట్లు చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని నివా­రించగలిగారు. ఎనిమిది జిల్లాల్లో 320 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. 20,572 మందిని తరలించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 124 శిబిరాల్లో 6,077 మందికి ఆశ్రయం కల్పించారు. తిరుపతి జిల్లాలో 36 కేంద్రాల్లో 3,386 మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో పన్నెండు కేంద్రాల్లో 5,113, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 37 కేంద్రాల్లో 910, బాపట్ల జిల్లాలో 74 కేంద్రాల్లో 3,888, గుంటూరులో 14 శిబిరాల్లో 1,111, కోనసీమ జిల్లాలో 36 శిబిరాల్లో 910, పశ్చిమ గోదావరిలో 32 శిబిరాల్లో 5,113, తూర్పు గోదావరిలో 3 కేంద్రాల్లో 87 మందికి పునరావాసం కల్పించారు. బాధితులందరికీ భోజనం, మంచి నీటి సౌకర్యం కల్పించారు. వారికి అక్కడే నిత్యావసరాలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాలు ఇళ్లకు వెళ్లే ముందు ఆర్థిక సాయంగా రూ.1000 నుంచి రూ.2500 అందిస్తున్నారు.తుఫాను ప్రభావిత గ్రామాల్లో 6 ఎస్డీఆర్‌ఎఫ్, 6 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు, ఉలవపాడు, బాపట్ల, నాయుడుపేటలో ఈ బృందాలు సేవలు అందిస్తున్నాయి. అధికార యంత్రాంగం దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించడంతో రాకపోకలు యధాతథంగా కొనసాగుతున్నాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో రైతులు ముంపునకు గురైన పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆర్బీకే సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోవైపు రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆపదలో ఉన్న రైతులను గుర్తించడమే కాకుండా, వారి వద్ద నుంచి ధాన్యం కొనుగోలు వెంటనే కొనుగోలు చేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు.  సీఎం ఆదేశాల మేరకు తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంద్ర‌కీలాద్రి అలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు  శంఖుస్థాపన చేశారు. రూ. 216 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు, 5 కోట్ల దాతల నిధులు, 33 కోట్ల ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం వైయ‌స్  జగన్ కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు నృత్యాలతో పిల్లలు, నాట్యకారులు అలరించారు. ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, కేశఖండన శాల నిర్మాణం చేశారు. దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలు.. శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ పున నిర్మాణానికి 5.60 కోట్లు.. ఇంద్రకీలాద్రి పై కొండ రక్షణ చర్యపనుల నిమిత్తం 4.25 కోట్లు.. ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ వాటర్ మేనేజ్ మెంట్, స్కాడా ఏర్పాటు నిమిత్తం 3.25 కోట్లతో నిర్మించారు. 2016 పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాలను 3.87 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నారు. మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కు 5.66 కోట్లు.. కొండ దిగువున బొడ్డురాయి నిర్మాణం 23 లక్షలు.. కొండ దిగువున తొలిమెట్టు వద్ద రూ.2. 65 కోట్లతో ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వార్ల ఆలయ నిర్మాణం చేపట్టారు.  అమ్మవారి అన్న ప్రసాద భవన నిర్మాణ కు రూ. 30 కోట్లు.. అమ్మవారి ప్రసాదం పోటు భవన నిర్మాణానికి రూ. 27 కోట్లు.. కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు 13 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. రాజగోపురం ముందు భాగాన రూ. 15 కోట్లతో మెట్ల నిర్మాణం.. అలాగే, మహామండపం వద్ద అదనపు క్యూలైన్ల కోసం రూ. 23.50 కోట్ల కేటాయించారు. కనక దుర్గ నగర్ వద్ద మహారాజద్వారం నిర్మాణం 7.75 కోట్లు.. కనకదుర్గ నగర్ నుండి మహామండపం వరకు రాజమార్గము అభివృద్ధి నిమిత్తం 7.50 కోట్లు.. కొండపైన పూజా మండపాల నిర్మాణం 7 కోట్లు ఖర్చు చేశారు. మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్చుటకు 18.30 కోట్లు.. నూతన కేశఖండన శాల నిర్మాణం నిమిత్తం 19 కోట్లు.. గోశాల అభివృద్ధి నిమిత్తం 10 కోట్లు.. కొండపన యాగశాల నిమిత్తం 5 కోట్లు.. కనకదుర్గ నగర్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిమిత్తం 33 కోట్ల రూపాలతో అభివృద్ది పనులు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com