పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు జరగనున్న సమావేశంలో రెండు ముఖ్యమైన బిల్లులను సమర్పించనున్నారు.
ఈ సమావేశం ప్రారంభంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.