ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరికొత్త ఫీచర్స్ తో.. జొమాటో కొత్త యాప్..!

Technology |  Suryaa Desk  | Published : Thu, Nov 28, 2024, 02:52 PM

జొమాటో సరికొత్త ఫీచర్స్ తో కొత్త 'డిస్ట్రిక్ట్' యాప్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త యాప్ ద్వారా జోమాటో తన 'గోయింగ్-అవుట్' వ్యాపారాన్ని ప్రోత్సహించాలనుకుంటోంది. ఇందులో సినిమా టికెట్ బుకింగ్, ఈవెంట్ బుకింగ్, రెస్టారెంట్లలో టేబుల్ బుకింగ్ ఉన్నాయి. యూజర్లు సినిమాలు, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్, షాపింగ్‌ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. డైనింగ్, షాపింగ్ వంటి వాటికోసం కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఒకే యాప్‌లో అన్ని సౌకర్యాలు లభిస్తాయి. జోమాటో 'గోయింగ్-అవుట్' విభాగంలోకి ప్రవేశించడం అనేది దాని ఆదాయ ప్రవాహాన్ని పెంచుకోవడం, పెరుగుతున్న వినోద పరిశ్రమను సద్వినియోగం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ Paytm ఈవెంట్‌లు, టికెటింగ్ వ్యాపారాన్ని ఆగస్టు 2023లో రూ. 2,048 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఈ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.
డిస్ట్రిక్ట్ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు గతంలోనే దీపీందర్ గోయల్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది. ఫుడ్ డెలివరీలో ముందు వరుసలో దూసుకెళ్తున్న జొమాటో.. టికెటింగ్ వ్యాపారంలో కూడా తన ఉనికిని విస్తరించడానికి 2024 ఆగష్టులో పేటీఎం నుంచి టికెటింగ్ బిజినెస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ లాంచ్ చేసింది. ఇది ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌గా జొమాటో అందరికీ సుపరిచితమే. ఫుడ్ డెలివరీతో మొదలుపెట్టి వేగంగా ఇతర విభాగాలకు సైతం తన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే కిరాణా సరుకుల డెలివరీ ప్రారంభించి మంచి జోరుమీదుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com