ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో వివిధ కళాశాలలో సభ్యత్వం నిర్వహించి కమిటీలను ఎన్నుకోవడం జరిగినది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో పుడ్ ఫాయిజాన్ కేసులు వెలుగుచూస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని,వాంఖిడి ఘటనలో విద్యార్ధిని చనిపోయిన కూడా ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని తక్షణమే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పై ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటి ప్రభుత్వాని డిమాండ్ చేస్తోంది. నారయణ పేట మాగనూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది.
రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ తో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 920 మంది,ఆస్పత్రి పాలైనరన్నారు.రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది
రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్, ఈద్ది రాములు,చరణ్,రాజేష్ సన్నీ,అంజి, విక్రమ్ వంశీ నందిని, శిరీష,శైలజ,గాయత్రి, మంజుల తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు పాల్గొన్నారు