దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అనుసరించనున్న విధానాలు, వాణిజ్య యుద్ధ భయాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై నెలకొన్న అనిశ్చితి మార్కెట్ల పతనానికి కారణమయింది. ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,190 పాయింట్లు నష్టపోయి 79,043కి దిగజారింది. నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయి 23,914కి పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్ (-3.46%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.36%), బజాజ్ ఫైనాన్స్ (-2.84%), అదానీ పోర్ట్స్ (-2.73%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.