రెడ్మీ నుంచి 'రెడ్మీ కె80' సిరీస్ విడుదల అయ్యింది. ఇందులో రెండు ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చారు. అవి రెడ్మీ కె80, రెడ్మీ కె80 ప్రో. రెడ్మీ కె80 ప్రో ఫోన్లో శక్తివంతమైన ప్రాసెసర్ ఉంది. పెద్ద బ్యాటరీ, అద్భుతమైన కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ చూద్దాం..
రెడ్మీ కె80 ప్రో మొబైల్ దాని స్టైలిష్ లుక్స్, అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. కంపెనీ దీనిని నాలుగు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేసింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఫోన్ రన్ అవుతుంది. ఇందులో 6.67 అంగుళాల డిస్ప్లే కూడా ఉంది. ఇది 16జీబీ ర్యామ్, 6000mAh బ్యాటరీ, 120W వైర్డ్ ఛార్జింగ్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుంది.
రెడ్మీ కె80 ప్రో ఫోన్ ధరలు
12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ ధర - రూ. 43,190
12జీబీ ర్యామ్ ప్లస్ 512జీబీ స్టోరేజ్ ధర - రూ. 46,690
16జీబీ ర్యామ్ ప్లస్ 512జీబీ స్టోరేజ్ ధర - రూ. 50,190
16జీబీ ర్యామ్ ప్లస్ 1టీబీ స్టోరేజ్ ధర -రూ. 56,000
12జీబీ ర్యామ్, 16జీబీ ర్యామ్‌తో రెడ్మీ కె80 ప్రోను చైనాలో లాంచ్ చేసింది. నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ.56,000గా నిర్ణయించారు. రెడ్మీ కె80 ప్రో మొబైల్ 6.67-అంగుళాల 2కె డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఓఎల్ఈడీ పంచ్ హోల్ స్టైల్ అల్ట్రా నారో ఎడ్జ్ డిస్ప్లే. డిస్ప్లే 3,200 × 1,440 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ని కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్లో 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వెట్ హ్యాండ్ టచ్ గ్లాస్ కవర్ ఉన్నాయి.