శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.ఇదిలా ఉంటే వంటగదిలో ఉండే కొన్ని రకాల మసాలాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండె సిరల్లో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ సిరల్లో పేరుకుపోయినప్పుడు గుండెపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది .కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కొన్ని హోం రెమెడీస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇదిలా ఉంటే ఖాళీ కడుపుతో మసాలా దినుసులతో తయారుచేసిన నీటిని తాగడం ద్వారా, చెడు కొలెస్ట్రాల్ మైనంలా కరిగి శరీరం నుండి తొలగించబడుతుంది.పసుపు, నల్ల మిరియాలు: పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంది. ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇది కర్కుమిన్‌ను శరీరం గ్రహించడంలో సహాయపడుతుంది.