దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై కొనసాగుతున్న అనిశ్చితి మార్కెట్ల పతనానికి కారణమయింది. మధ్యాహ్నం 1.45 గంటల సమయానికి సెన్సెక్స్ 983 పాయింట్లు పతనమై 79,250కి పడిపోయింది. నిఫ్టీ 297 పాయింట్లు కోల్పోయి 23,977 వద్ద కొనసాగుతోంది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది.ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, టెక్ మహీంద్రా, టీసీఎస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ తదితర బ్లూచిప్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్ లాభాల్లో ఉన్నాయి.