అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తెలిపారు.
గురువారం ఈపూరు మండలంలోని గ్రామంలో అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను టిడిపి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.