కృష్ణా జలాల వివాదంపై ఏపీ, తెలంగాణ అధికారులతో ఈరోజు (శుక్రవారం) జరగాల్సిన భేటీని కేంద్రం రద్దు చేసింది. ఎప్పుడు నిర్వహించాలనేది తర్వలోనే తెలియజేస్తామని కేంద్ర జల్ శక్తి కార్య దర్శి తెలిపారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. గత నెల 30న నాగార్జునసాగర్ 13గేట్లను ఏపీ అధీనంలోకి తీసుకోవడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.