తిరుపతి జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. నష్టపోయిన రైతులు, బాధితులతో మాట్లాడారు. వరుసగా వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారని అన్నారు.
60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి రూ.2,500 ఇస్తామని ప్రకటించారు. ప్రతీ ఇంటికి వలంటీర్ వచ్చి నగదు ఇస్తారని అన్నారు. రైతులను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.