తిరుపతిలో రోడ్ల నిర్మాణానికి, పారిశుద్ధ్య పనులకు టీటీడీ నిధులు ఇచ్చేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీటీడీ నిధులు వినియోగించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.
దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, తిరుపతి మున్సిపల్ కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది.