ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఎగుమతులపై నిషేధం విధించింది.
ధరల కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఎగుమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది.