విశాఖ నగరంలో మరో దిగ్గజ సంస్థ కొలువుదీరనుంది. అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్రైజ్ పేరుతో విశాఖలో ఐటీ అనుబంధ సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చింది.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. ఎపిటా, ఏసీఎన్ ఇన్ఫోటెక్ అనే బీపీవో సంస్థ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఇక్కడ 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు.