పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సతీమణి బుషా బీబీకి నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) సమన్లు జారీ చేసింది. తోశంఖానా కేసుకు సంబంధించి విచారణ కోసం డిసెంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటలకు రావల్పిండిలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొంది.
అలాగే కేసుకు సంబంధించిన బంగారు నెక్లెస్, డైమండ్ రింగ్, బ్రాస్‌లెట్ కూడా తీసుకురావాలని కోరినట్లు స్థానిక మీడియా తెలిపింది.