ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసి, ఆమె ముఖాన్ని సిగరెట్లతో కాల్చి గొడ్డలితో దారుణంగా నరికి చంపాడో కిరాతకుడు. ఈ ఘటన సుల్తాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
సూరజ్ కుమార్ సోన్కర్ అనే వ్యక్తికి డబ్బులు అప్పుగా ఇచ్చిన మహిళ తిరిగి అడగడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచారం చేసి, ఆమె ముఖాన్ని సిగరెట్లతో కాల్చాడు. అనంతరం గొడ్డలితో మహిళను నరికి చంపి మృతదేహాన్ని రోడ్డుపై పడేశాడు.