ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదన్న టీడీపీ విమర్శలపై సీఎం జగన్ స్పందించారు. విపత్తుల సమయంలో తను పర్యటిస్తే.. అధికార యంత్రాంగం అంతా తన వెనుకే ఉంటుందని, దీంతో సహాయక చర్యలు లోపిస్తాయన్నారు.
జరిగే పనిని చెడగొట్టి, ఫొటోలకు పోజులిచ్చి, మీడియాలో కనిపించాలని తాపత్రయపడే సీఎం ఇప్పుడు లేడని ఎద్దేవా చేశారు. అందుకే తను రాకుండా కలెక్టర్, అధికారులు, సచివాలయ వ్యవస్థను అప్రమత్తం చేశానని బాపట్ల పర్యటనలో స్పందించారు.