ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ సోమరితనంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి నీరంతా సముద్రంలో కలుస్తోందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని సీఎం తమపై నిందలు వేస్తున్నారన్నారు. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.