లైంగిక వేధింపులకు పాల్పడిన నేరానికి అమెరికాలోని జార్జియాలో హోటల్ మేనేజర్‌గా ఉన్న భారతీయుడు శ్రీష్ తివారి(71)కి స్థానిక న్యాయస్థానం 57 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన హోటల్లో పనిచేస్తున్న మహిళను లైంగికంగా వేధించడంతో పాటు, ఆమెను పదే పదే బెదిరిస్తూ నిందితుడు చిత్రహింసలు పెట్టాడని అతడిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో జైలుశిక్షతో పాటు 40 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.