మడకశిర పట్టణంలో టిడిపి కార్యాలయం వద్ద శనివారం టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ బీసీలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుందన్నారు. మడకశిరలో ఈనెల 6న చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర సైతం తుస్సుయాత్రగా మారిందన్నారు. జనంలేక సభ వెలవెలబోయిందన్నారు. బీసీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నదే టిడిపి లక్ష్యం అనితెలిపారు.