కదిరిలో విద్యార్థులను ఉపాధ్యాయురాలు కొట్టారని శుక్రవారం డీఈఓ మీనాక్షి విచారణ చేపట్టారు. బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జయలక్ష్మి గురువారం విద్యార్థులను కొట్టిందంటూ తల్లిదండ్రులు గొడవకు వచ్చారు. టీచరు, తల్లిదండ్రుల మధ్య జరిగిన వివాదంపై పత్రికల్లో వార్తలు రావడంతో కలెక్టరు అరుణ్‌బాబు విచారణ చేయాలని డీఈఓను ఆదేశించారు. దీంతో డీఈఓ పాఠశాలలో విచారణ జరిపారు.