బాపట్ల జిల్లా జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. తుపాను వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఎస్టీ కాలనీని పరిశీలించారు. తుపాను వల్ల సర్వం కోల్పోయామని.. విద్యుత్ సరఫరా లేక 4 రోజులు చీకట్లోనే గడిపామని గిరిజనుల ఆవేదన వ్యక్తం చేశారు. వారికి దైర్యం చెప్పిన బాబు.. అధికారంలోకి రాగానే కాలనీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ. 5 వేలు సాయం అందిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa