విద్యార్థులకు కెనడా ప్రభుత్వ షాకిచ్చింది. తాజాగా అక్కడి ప్రభుత్వం స్టూడెంట్ పర్మిట్ డిపాజిట్‌ను రెట్టింపు చేసింది. రెండు దశాబ్దాలుగా 10 వేల డాలర్లుగా ఉన్న డిపాజిట్ మొత్తాన్ని ఏకంగా 20,635 డాలర్లకు పెంచుతున్నట్లు కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ ప్రకటించారు.
ఈ నిబంధన వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు ఆయన వివరించారు.