విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దని సూచించారు.
ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం రూ.8,406 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని భూమిని అప్పగిస్తే ఇవాళ్టి నుంచే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.