ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడినట్లు సీఎస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 11కు బదులుగా 14న ఉదయం 11గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ అవుతుందని పేర్కొన్నారు.
12వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా ప్రతిపాదిత అంశాలు పంపించాలని ఆయా శాఖల కార్యదర్శులను సీఎస్ కార్యాలయం ఆదేశించింది.