ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జవహర్ రెడ్డికి ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు ఆలయ సిబ్బంది పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. జవహర్ రెడ్డి వెంట కలెక్టర్ హిమాన్ష్ శుక్ల ఉన్నారు.