ఎన్నికల బరిలో నిలబడే ఏ వ్యక్తికైనా.. రాజకీయ పార్టీకైనా ఒక స్థాయి, బలం ఉంటుంది. ఎన్నికల ఫలితాలనే ఆ రాజకీయ పార్టీ నాయకుడి స్థాయి, అతని నాయకత్వ బలానికి కొలమానంగా చూస్తారు. దీన్నిబట్టి చూస్తే.. పవన్‌కళ్యాణ్ కన్నా బర్రెలక్కనే నయమనిపిస్తుంది అని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. అయన మాట్లాడుతూ.... స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆమె బలం కన్నా జనసేన పార్టీ చాలా వీక్‌గా కనిపించింది. అతని నాయకత్వ బలం పేలవమని.. ఎన్నికల బరిలో నిలబడే స్థాయి ఆపార్టీకి లేదని తేటతెల్లమైంది. కనుకనే, అతను ఈ రాష్ట్రంలో పర్యటించిన ప్రతీచోటా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రభుత్వ పరిపాలనను విమర్శిస్తూ ప్రజల్లో ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన నిన్న విశాఖపట్నంలో ప్రభుత్వం మీద, వైయస్ జగన్‌పై ఇష్టానుసారంగా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడాడు. ఆయన మాటల్ని వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మేము, ప్రజలు కూడా ఖండిస్తున్నారు అని అన్నారు.