ఏపీలోని ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ రెడ్డి అసమర్థ పాలనతో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఊడి నీరు వృథాగా పోతోందని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా తమపై నిందలు వేయడమేంటని ప్రశ్నించారు. టీఎంసీ.. క్యూసెక్కు.. ఈ రెండింటికీ తేడా తెలియని వారికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు మారకపోతే ఆందోళనలు చేపడతామన్నారు.