చైనాలో ఓ మహిళ కంటికి ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు 60 బతికున్న పురుగులను బయటకు తీశారు. మిర్రర్ ప్రకారం.. ఓ మహిళ కొద్ది రోజులుగా కంటి నొప్పి, దురదతో బాధపడుతోంది.
ఒకసారి కళ్లు రుద్దిన తర్వాత పురుగులు కింద పడటం చూసి ఆందోళనకు గురైంది. వెంటనే చైనాలోని కున్మింగ్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లి పరీక్షించుకున్నారు. ఆమె కనుబొమ్మలు, కనురెప్పల మధ్య పురుగులు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు 60 వరకు బతికున్న పురుగులు తొలగించారు.