సీఎం జగన్ కు ఉల్లిగడ్డ, బంగాళాదుంపకు తేడా తెలియదుని టీడీపీ అగ్రనేత లోకేశ్ చమత్కరించారు. తొండంగి మండలంలోకి ప్రవేశించిన లోకేశ్ యువగళం పాదయాత్రలో మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు.
వేటకు వెళ్లి చనిపోయినవారి కుటుంబసభ్యులను ఆదుకోవాలని.. వలల ధర తగ్గేలా చూడాలని మత్స్యకారులు కోరారు. వేటకు వెళ్లి చనిపోతే వైద్యుడి ధ్రువపత్రం అడుగుతున్నారని తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు.