ముదిగుబ్బ మండల కేంద్రానికి మంచినీటి వ్యవస్థను మెరుగుపరిచి ప్రజలందరికీ మంచినీటిని అందించాలని సీపీఐ ముదిగుబ్బ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మేజర్ పంచాయతీల్లో మొదటిదైన ముదిగుబ్బలో 20వేల పైచిలుకు జనాభా ఉన్నారని, కానీ మంచినీటి వ్యవస్థలో లోపాలు ఉండడంతో తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.