సర్పంచులకున్న అధికారాలన్నీ తొలగించి సర్పంచుల వ్యవస్థను సర్వనాశనం చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనగుంట్ల భూషణ్ ధ్వజమెత్తారు. శనివారం ధర్మవరంలో ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచ్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..గ్రామాభివృద్ధికి పాటు పడుతున్న సర్పంచ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని వెంటనే సర్పంచుల అధికారాలన్నీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.