అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామ సమీపంలో శనివారం రోడ్డుపై వెళ్తున్న అడవి పందిని తప్పించబోయి కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలు తగిలి ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాన్ని పక్కకు తరలించారు. వాహనాల రాకపోకులకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.