పుట్లూరు మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని పుట్లూరు బీజేపీ ఓబీసీ మోర్చ మండల అధ్యక్షుడు రామంజి యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ. ప్రస్తుతం చాలా వరకు అగ్నిమాపక కేంద్రాలు రెవెన్యూ డివిజన్ కేంద్రాలకే పరిమితమైనాయన్నారు. పల్లెలకు చాలా దూరంలో ఉండటం వల్ల అగ్నిప్రమాదాలు సంభవిస్తే వాటిని అదుపు చేయలేకపోతున్నారని తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.