ఛత్తీస్గఢ్లో 20 మంది మావోయిస్టులు శనివారం పోలీసులకు లొంగిపోయారు. వీరిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరంతా సుక్మా జిల్లాలోని వివిధ మావోయిస్టు అనుబంధ విభాగాలకు చెందిన వారని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు.
అమానవీయమైన మావోయిస్టు సిద్ధాంతాలతో పనిచేయలేమని వారు తెలిపారని అన్నారు. ఈమేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లొంగిపోయిన వారికి పునరావాస కార్యక్రమాలను వర్తింప జేస్తామన్నారు.