బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో దాదాపు రూ.2,190 కోట్ల వ్యయంతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేయనున్నారు.