ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బడ్జెట్లో ఇప్పటివరకూ ఏపీకి రూ.8,406 కోట్లు కేటాయించామని తెలిపారు.
విజయనగరం జిల్లా కంకటాపల్లి రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం విశాఖ చేరుకున్న ఆయన సింహాచలం స్టేషన్ని సందర్శించారు.