వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకొనే పని చేశా. నేనేమీ నిజాయితీపరుడని చెప్పుకోవడం లేదు. డబ్బులు తీసుకోకుండా రాజకీయాలు చేయలేం.
నేను ఖర్చు పెట్టేదంతా చూసి నా దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయనుకుంటారు. అప్పులు చేసి రాజకీయం చేస్తా. గత ఎన్నికల ఖర్చంతా నా వియ్యంకుడే పెట్టుకున్నాడు." అని ఆయన అన్నారు.