దేశ సరిహద్దుల్లో శత్రువుల సైనిక మోహరింపుపై నిఘా పెట్టేందుకు భారత ఆర్మీ కృత్రిమ మేధ సాయం తీసుకొనున్నట్లు సమాచారం. దీనికోసం ఇండియన్ ఆర్మీ ఏఐ ఆధారిత దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏఐ సాయంతో దేశ సరిహద్దుల వెంబడి శత్రు దేశాల సైన్యాలు మోహరించిన ఆయుధాలు, యుద్ధ వాహనాలు, ఇతర యుద్ధ పరికరాల వివరాలను సేకరిస్తుందని పేర్కొన్నాయి.