ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన నావిగేషన్ యాప్ ‘గూగుల్ మ్యాప్స్’లో మార్పును చేపట్టింది. సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ‘జెమిని’ని మ్యాప్స్‌లో విలీనం చేస్తూ, వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా ఈ విప్లవాత్మక ఫీచర్లను ప్రకటించారు. కొత్తగా పరిచయం చేసిన ‘Ask Maps’ ఫీచర్‌తో యూజర్లు ఇకపై మ్యాప్స్‌ను నేరుగా ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు, “దగ్గరలో రద్దీ లేని పబ్లిక్ బాత్రూమ్ ఎక్కడ ఉంది? , ఎక్కువసేపు లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేని ఈవీ (EV) ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉంది?” ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు జెమిని ఏఐ తక్షణమే సమాధానాలు ఇస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa