ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాపిడో డ్రైవర్ మానవత్వం.. అంధ విద్యార్థికి అండగా నిలిచిన వైనం

national |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 02:27 PM

ప్రస్తుత జీవితంలో మానవత్వం గొప్పదని అస్సాం రాజధాని గువహటిలో ఒక రాపిడో డ్రైవర్ నిరూపించారు. ఒక అంధ విద్యార్థి తన కాలేజీకి వెళ్లడానికి రాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. డ్రైవర్ ఆ విద్యార్థిని జాగ్రత్తగా బైక్‌పై కూర్చోబెట్టుకుని కాలేజీ వద్దకు తీసుకెళ్లారు. గేటు వద్ద వదిలేయకుండా, విద్యార్థిని తరగతి గది వరకు చేత్తో పట్టుకుని నడిపిస్తూ తీసుకెళ్లారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. డ్రైవర్ మానవత్వాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa